శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు జనవరి 27 2010 న స్వర్గస్థులయారు.
(25-10-1922 — 27-01-2010 )
చందమామ కథా రచయిత, చందమామ తొలితరం సంపాదకవర్గ సభ్యుడు. 1952లో (కొడవటిగంటి కుటుంబరావు గారి కంటే నాలుగు సంవత్సరాల ముందు) చందమామ లో చేరి, 2006 దాకా (అంటే 55 సంవత్సరాల కాలం) అందులోనే కొనసాగారు.
పెద్దగా చదువుకోక పోయినా నిరంతర అధ్యయనంతో, బాల్యంలోనే తెలుగు ప్రబంధ కావ్య, పంచతంత్ర కథలు, కథా సరిత్సాగరం లాంటి పుస్తకాలను ఆపోశన పట్టారు.
ధారావాహికల రచనలో మంచి ప్రతిభ కలిగిన దాసరి 12 ధారావాహికలను రాశారు. ఆయన సృష్టించిన జ్వాలా ద్వీపం, రాకాసి లోయ వంటి అనేక రచనలు తెలుగు వారికి సుపరిచితాలు.
