మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గురు, శనులు అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాలలో చాలావరకు మంచే
జరుగు తుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. సానుకూల దృక్పథంతో
వ్యవహరించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి.
ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇంటా బయటా ప్రశాంతంగా, గౌరవ ప్రదంగా సాగిపోతుంది.
పిల్లల చదువుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. వృత్తి,
వ్యాపారాలలో డిమాండ్ బాగా పెరుగుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆరవ స్థానంలో రవి, బుధుల కలయిక వల్ల సమాజంలోని ప్రముఖులతో మంచి పరిచయాలు
ఏర్పడతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో
పనిభారం ఉంటుంది. బంధు మిత్రుల నుంచి ఆదరణ లభిస్తుంది. మీ సలహాలు,
సూచనలకు విలువ ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఆశించిన స్థాయిలో
ఉద్యోగావకాశాలు అందివస్తాయి. విందు వినో దాల్లో చురుకుగా పాల్గొంటారు.
పిల్లలకు సంబంధించిన సమాచారం ఒకటి సంతృప్తిని కలిగిస్తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
లాభ స్థానంలో గురు, రాహువుల సంచారం వల్ల ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కానీ,
వృథా ఖర్చులు పెరిగిపోయే సూచనలున్నాయి. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు
సహాయం చేసే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరిగి తీరిక లేని
పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి, మంచి
ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆద రణ ఉంటుంది కానీ,
కొందరు సహచరుల ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. మిత్రుల సహాయం లభి
స్తుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ధన స్థానంలో శుక్ర గ్రహ సంచారం వల్ల ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది.
వృత్తి, ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు కూడా ఆశాజనకంగా ముందుకు సాగుతాయి.
కీలక విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని ఆశించిన స్థాయిలో లాభపడతారు.
నూతన ప్రయత్నాలకు అవ రోధాలు తొలగుతాయి. బంధువుల నుంచి ఆదరపూర్వక
ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న వ్యవహారాలు అనుకున్నట్టు పూర్తవుతాయి.
కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
గురువు, కుజ, బుధుల అనుకూలత కారణంగా ఆదాయ వృద్ధి, కార్యసిద్ధి ఉంటాయి.
వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం
పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం పట్ల కాస్తంత అప్రమత్తంగా ఉండాల్సిన
అవసరం ఉంది. బంధుమిత్రుల వల్ల కొన్ని కీలక పనులు సానుకూలపడతాయి. కొత్త
ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు సత్ఫలితా బలను ఇస్తాయి. రావలసిన డబ్బు
కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. బాకీలు వసూలు అవుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ధన స్థానంలో బుధుడు ఉన్న కారణంగా వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు
వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. దగ్గర వారి నుంచి
రావాల్సిన డబ్బు కూడా అందుతుంది. ఆర్థిక ప్రయత్నాల్లో కొద్దిగా మానసిక
ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. సమా జంలో పేరు ప్రఖ్యాతలు పెరగడం, మంచి
గుర్తింపు లభించడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి
వస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
మూడు శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యమైన పనుల్ని సునాయాసంగా పూర్తి
చేస్తారు. బంధువులతో స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.
వ్యాపారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు
ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫల మయ్యే అవకాశం ఉంది.
ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ధశమ స్థానంలో శుక్రుడు, వ్యయ స్థానంలో రవి, కుజ, బుధులు ఉండడం వల్ల
వివాహ, ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. సమాజంలో
ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో అటు అధికారులను,
ఇటు సహోద్యోగులను పని తీరుతో ఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం
చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు సజావుగా సాగిపోతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
నవమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల అనవసర వివాదాలకు అవకాశం ఉంది.
ముఖ్యంగా కుటుంబ పెద్దలతో వాదోపవాదాలకు దిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో
అధికారులతో సామ రస్యం పెరుగుతుంది. మిత్రులతో విందులు, వినోదాల్లో
పాల్గొంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. ఇంటా
బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది కానీ, ముఖ్యమైన ప్రయత్నాలను
కొనసాగిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగు తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ధన స్థానంలో శనీశ్వరుడు, దశమ స్థానంలో రవి, బుధ, కుజులు సంచరించడం వల్ల
అనుకోని అదృష్టం పడుతుంది. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి చాలావరకు
విముక్తి లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలు ఏమైనా ఉంటే అవి పెద్దల
జోక్యంతో సానుకూలంగా పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల వాతావరణం
అనుకూలంగా ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. స్వల్ప
అనారోగ్య అవకాశాలున్నాయి. ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగు
తాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
నవమ స్థానంలో రవి, బుధుల కలయిక వల్ల ఆర్థిక పరిస్థితి బాగా
మెరుగుపడుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు
వేగం పుంజుకుంటాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. నిరుద్యోగుల
ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. కుటుంబ
పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉండే
అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాలలో కలిసి వస్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రాశ్యధిపతి అయిన గురువు ధన స్థానంలో ఉన్నందువల్ల ఆర్థిక ప్రయత్నాలన్నీ
విజయవంతం అవుతాయి. అనేక మార్గాలలో ఆదాయం పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో
బాధ్యతలను, విధులను సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహించి, మంచి గుర్తింపు
పొందుతారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్య సమస్యల
నుంచి చాలావరకు బయట పడతారు. ఒకటి రెండు కుటుంబ సమస్యలు పరిష్కారం అయి
కొంత మనశ్శాంతి ఏర్పడుతుంది.