ఇటీవలే కాంగ్రెస్ కి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ ఆదివారం ఢిల్లీ వేదికగా బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జీ తరుణ్ ఛుగ్ ఆయనకు పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్, మురళీధర్ రావు, వివేక్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు మోదీ పథకాలను, బీజేపీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తాను ప్రయత్నిస్తానని ప్రకటించారు.
తెలంగాణ అభివృద్ధి చెందాలంటే అధికార మార్పు అవసరమని, తెలంగాణలో చికోటి ప్రవీణ్ లాంటి వారు ఎందరో ఉన్నారని ఆరోపించారు. చికోటి వెనక ఉన్నది మొత్తం టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులేనని దాసోజు శ్రవణ్ ఆరోపణ చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే విచ్చలవిడిగా దోచుకున్నారని, అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. సంక్షేమ పనులు చూసి శ్రవణ్ బీజేపీలో చేరారని, తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీనేనని తరుణ్‌చుగ్ అభిప్రాయపడ్డారు.