గోవాలో అక్రమంగా బార్ నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీ (18) పై కొన్ని రోజులుగా కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీ గోవాలో ఎలాంటి బార్ నూ నిర్వహించడం లేదని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. వారిద్దరూ ఎలాంటి బార్ కూ ఓనర్లుగా లేరని స్పష్టం చేసింది. వారిద్దరూ అసలు లైసెన్స్ కోసం దరఖాస్తులు కూడా చేసుకోలేదని, కాంగ్రెస్ నేతలు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఆమె కుమార్తె జోయిష్ పై దుష్ప్రచారం చేస్తోదంటూ ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రెస్టారెంట్, ఆ భూమి కూడా స్మృతి ఇరానీ, ఆమె కుమార్తెకు చెందినది కాదని కూ
డా తెలిపింది.
తన కుమార్తె పై కాంగ్రెస్ నేతలు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తోందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డ విషయం తెలిసిందే. అంతేకాకుండా కాంగ్రెస్ నేతలకు లీగల్ చర్యలకు దిగిన విషయం కూడా విదితమే. బేషరతుగా లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పాలని, వారు చేసిన ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆ నోటీసులో ఆమె డిమాండ్ చేశారు. ఇవి కేవలం దురుద్దేశపూరితంగా చేసిన ఆరోపణలేనని ఆమె స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రూ.5,000 కోట్లు లూటీ చేశారని తాను చెప్పడం వల్లే తన కూతుర్ని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. తన కుమార్తె ఫస్టియర్ కాలేజీ విద్యార్థిని అని, ఎలాంటి బార్ నడపడం లేదని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు.