ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఆధిక్యంలో ఆప్, బీజేపీ వున్నాయి. ఈ రెండు పార్టీల మధ్యే హోరాహోరీ పోటీ నడుస్తోంది. ఇప్పటి వరకైతే బీజేపీ 25 వార్డుల్లో విజయం సాధించింది. మరో 79 స్థానాల్లో ముందంజలో నడుస్తోంది. ఇక.. కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ 21 వార్డుల్లో గెలిచింది. 105 స్థానాల్లో ముందంజలో వుంది. అయితే… కాంగ్రెస్ ప్రభావం ఏమాత్రం ఈ ఎన్నికల్లో ఏమాత్రం కనిపించడం లేదు. కేవలం 3 వార్డుల్లోనే గెలిచింది. 7 స్థానాల్లో ముందంజలో వుంది.ఇక… ఈ ఎన్నికల్లో ఎంసీడీ చరిత్రలోనే అరుదైన సంఘటన జరిగింది. సుల్తాన్ పురి ఏ వార్డులో ఆప్ తరపున ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ వ్యక్తి గెలిచారు. దీంతో తొలి ట్రాన్స్ జెండర్ గా చరిత్రలోకెక్కారు.
