మహారాష్ట్ర రాజకీయాల్లో మరో విచిత్రం చోటు చేసుకుంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరేతో భేటీ అయ్యారు. ముంబైలోని రాజ్ థాకరే నివాసానికి ఫడ్నవీస్ స్వయంగా వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు వీరి భేటీ సాగింది. అయితే.. గత నెలలో థాకరేకి సర్జరీ జరిగింది.
డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ఈయనను మర్యాద పూర్వకంగానే భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది కానీ.. అతి తొందర్లో కేబినెట్ కూర్పు జరగనుంది. ఈ నేపథ్యంలోనే వీరి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. రాజ్ థాకరే పార్టీకి ప్రస్తుతం ఒక్కరే ఎమ్మెల్యే వున్నారు. రతన్ పాటిల్ అనే ఎమ్మెల్యేను కేబినెట్ లోకి తీసుకోవడానికి బీజేపీ-షిండే వర్గం రెడీ అయ్యింది. ఈ విషయంపై చర్చించడానికే దేవేంద్ర ఫడ్పవీస్ రాజ్ థాకరేతో భేటీ అయినట్లు సమాచారం.