రాంచరణ్ (Ram Charan), శంకర్ కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆర్‌సీ 15. ఈ సినిమాకి టైటిల్ ఏమిస్తారు? ఎప్పుడు ఇస్తారన్న చర్చ తీవ్రంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాలకు తెర దించుతూనిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు. రాంచరణ్ బర్త్ డే రోజు ఆర్‌సీ 15 టైటిల్ లోగో లాంఛ్ చేసేందుకు శంకర్ టీం ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించాడు. అంతేకాదు అన్నీ కుదిరితే 2024 సంక్రాంతి కానుకగా ఆర్‌సీ 15 ప్రేక్షకుల ముందుకు వస్తుందని కూడా చెప్పేశాడు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఆర్‌సీ 15 చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆర్‌సీ 15లో అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, సునీల్, జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆర్‌సీ 15 మూవీకి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.