తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతగా పేరుగడించిన దిల్ రాజు మరోసారి తండ్రి అయ్యాడు. మొదటి భార్య మరణం తర్వాత కుటుంబీకుల కోరిక మేరకు దిల్ రాజు 2020 లో తేజస్వినిని రెండో వివాహం చేసుకున్నాడు.
ఈ ఇద్దరు దంపతులకే తాజాగా మగబిడ్డ జన్మించాడు. మంచి నక్షత్రం పునర్వసులో మగ బిడ్డ పుట్టాడు. ఈ సందర్భంగా దిల్ రాజుకు పలువురు సెలెబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిర్మాత బండ్ల గణేశ్ దిల్ రాజు అన్నా… కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేశాడు.