పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది – డైరెక్టర్ కార్తికేయ
పా రిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రమ్ అద్భుతమైన ప్రగతి సాధిస్తోన్నదని మరింత అభివృద్ధికి, అవసరమైన కార్యక్రమాలు, నిర్ణయాలు తీసుకోవడానికి భారత ప్రభుత్వ రంగ సంస్థ , నేషనల్ స్మాల్ ఇండస్ట్రిస్ కార్పొరేషన్ , (NSIC, )నిబద్దతతో ఉన్నదని ,ఆ సంస్థ డైరెక్టర్ శ్రీ. కార్తికేయ సిన్హా, హైద్రాబాద్ లో తెలియజేసారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలలోని, ఆ సంస్థ హైద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం బ్రాంచిల కార్యక్రమాల, సమీక్ష కోసం గురువారం రోజున హైదరాబాద్ నగరం విచ్చేసిన కార్తికేయ సిన్హా, డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ మార్కెటింగ్ )మరియు గౌరవ్ గులాటి, , డైరెక్టర్ (ఫైనాన్స్, )ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ పారిశ్రామిక సంస్థల సమావేశంలో ప్రతినిధుల కు, ఎన్. ఎస్. ఐ. సి కార్యక్రమాలను విశదీకరించారు.
ఈ సమావేశంలో కాంఫేడేరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ పెనుర్స్ , ( కోవే-ఇండియా) , అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రిన్యూర్స్, ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్త్రీ (ఎఫ్. టి. సి. సి.ఐ), బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, లగు ఉద్యోగ్ భారతి, జీడిమెట్ల ఇండస్ట్రిస్ అసోసిషన్, బాలానగర్ మైక్రో & స్మాల్ ఇండస్ట్రిస్ అసోసియేషన్ ల ప్రతినిధులు ఆసక్తిగా
పాల్గొని, ఉభయ రాష్ట్రలలో చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూలంకుశoగా చర్చించారు.
ఈ సమావేశంలో నేషనల్ స్మాల్ ఇండస్ట్రిస్ కార్పొరేషన్, జోనల్ హెడ్ శ్రీ కె. శ్రీనివాస్ మరియు సీనియర్ బ్రాంచ్ మానేజర్ శ్రీ. ఎస్. సురేష్ లు, శ్రీ వీరభద్రరావు, శ్రీ సోమశేఖర్, శ్రీ అశ్విని కుమార్ పాల్గొన్నారు.