Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

చెక్ బౌన్స్ కేసులో డైరెక్టర్ లింగుసామి ఆరు నెలలు జైలు శిక్ష విధించిన కోర్టు!

రామ్ పోతినేని హీరోగా ‘ది వారియర్’ చిత్రాన్నిఅందించిన డైరెక్టర్ లింగుసామీ కి సైదాపేట్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించిందని తెలుస్తోంది. పీవీపీ ప్రొడక్షన్ వద్ద తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించలేదని, లింగుసామీ ఇచ్చిన చెక్ బౌన్స్ అవ్వడంతో సదరు ప్రొడక్షన్ కంపెనీ అతని పై కేసు వేసింది. తమిళనాడులోని సైదాపేట కోర్టు  చెక్కు బౌన్స్ చేసినందుకు డైరెక్టర్ లింగుసామీ కి ఆరు నెలల జైలు శిక్ష విధించినట్లు కోర్ట్ తీర్పునిచ్చింది. ఈ కేసులో లింగుసామీతో పాటు అతని సోదరుడు సుభాష్ చంద్రబోస్‌కు కూడా కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే…. పీవీపీ ప్రొడక్షన్ కంపెనీ వద్ద లింగుసామీ గతంలో కోటి రూపాయలు ఫైనాన్స్ తీసుకున్నాడట. ఆ తరువాత ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో జాప్యం జరిగిందట. ఆపై లింగుసామీ ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అవ్వడంతో సదరు సంస్థ సైదాపేట కోర్టు మెట్లు ఎక్కింది. జైలు శిక్ష పడటంతో లింగు సామీ మాత్రం పై కోర్టు లో అప్పీల్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మద్రాస్ హైకోర్టుకు గనుక లింగుసామీ అప్పీల్ చేసుకుంటే… అక్కడ ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి. అంతే కాకుండా లింగుసామీ ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు కూడా సిద్దంగానే ఉన్నట్టు సమాచారం. మొత్తానికి లింగుసామి చెక్ బౌన్స్ కేసు, ఆరు నెలల జైలు శిక్ష అనే వార్తలు వైరల్ అయ్యాయి. ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నాయి..ఇటీవల ‘ది వారియర్’ తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం, చెక్ బౌన్స్ కేసు లో శిక్ష పడటం టైం బాడ్ అంటే ఇదేనేమో?

Related Posts

Latest News Updates