ఎప్పుడూ అతి తక్కువగానే మాట్లాడే సినీ దర్శకుడ కె. రాఘవేంద్ర రావు ఈసారి రాజకీయంగా సంచలన వ్యాఖ్యలే చేశారు. సినిమాలకు సంబంధించే అప్పుడప్పుడూ మాట్లాడే ఈయన.. తాజాగా బాపట్ల జిల్లా వేదికగా హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు రాఘవేంద్ర రావు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
రెండేళ్లలో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమంటూ జోస్యం చెప్పారు. బాపట్ల జిల్లా చుండూరు మండం నడిగడ్డపాలెంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని రాఘవేంద్ర రావు ఆవిష్కరించారు. రోజు రోజుకీ ప్రజల్లో టీడీపీపై ప్రేమ, ఆదరణ పెరుగుతోందని అన్నారు. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడం ఖాయమని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అన్నారు.