ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి ఓ ఇంటివాడయ్యాడు. పూజ అనే అమ్మాయితో వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. ఈ మ్యారెజ్ కి పలువురు సినిమా ప్రముఖులు హాజరయ్యారు. హీరో నితిన్ తన భార్య శాలినితో కలిసి హాజరయ్యాడు. నూతన దంపతులకు కంగ్రాట్స్ చెప్పాడు. దీనిని నితిన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. నితిన్ వీళ్లతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు వెంకీ అట్లూరికి అభినందనలు తెలిపాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతూనే వున్నాయి. ‘స్నేహగీతం’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ‘తొలి ప్రేమ’ సినిమాతో దర్శకుడిగా మారాడు వెంకీ అట్లూరి. మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’, నితిన్‌తో ‘రంగ్‌దే’ సినిమాలు తెరకెక్కించాడు.
