ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారిస్తోంది. దాదాపు 8 గంటలుగా ఈ విచారణ సాగుతోంది. ఏపీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ఎమ్మెల్సీ కవితను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఈ విచారణ సాగుతోంది. కవిత, అరుణ్ పిళ్లైని కలిపి ఈడీ అధికారులు విచారించారు. ఇందులో సౌత్ గ్రూప్ తో సంబంధాలు, లావాదేవీల గురించే ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఓవైపు ఇదంతా జరుగుతుండగానే.. కవిత తరపున ముగ్గురు లాయర్లతోపాటు.. ఇద్దరు డాక్టర్లు ఆఫీసులోకి వెళ్లటంతో ఉత్కంఠ నెలకొంది. 30 నిమిషాల తర్వాత డాక్టర్ల బృందం బయటకు వెళ్లిపోయింది. అయితే… మొదటి దఫా ఈడీ ప్రశ్నించిన సమయంలోనూ ఇదే ఉత్కంఠత నెలకొంది. చివరికి కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటికి రావడంతో పార్టీ నేతలందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఈ సారి వైద్యులు ఎంట్రీ ఇవ్వడం, లాయర్లు రావడంతో పరిస్థితి మరింత ఉత్కంఠభరితంగా మారిపోయింది.