సామాన్యులపై మళ్లీ గ్యాస్ బండ భారం పడింది. వంట గ్యాస్, వాణిజ్య వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలకు పెరగ్గా… వాణిజ్యపరంగా ఉపయోగించే సిలిండర్ పై 350 రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరుగుతున్న ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయని చమురు సంస్థలు ప్రకటించాయి. ఇటీవలి కాలంలో పెట్రోలియం సంస్థలు ధరలను పెంచకుండా కాస్త రిలీఫ్ ఇచ్చాయి. కానీ… తాజాగా మళ్లీ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో సామాన్యులు తెగ ఇబ్బందులు పడుతున్నారు.
నిన్నటి వరకూ హైదరాబాద్‌లో గృహ వినియోగానికి వాడే సిలిండర్ ధర రూ.1155 ఉండగా.. పెరిగిన ధరతో రూ.1155కు చేరుకుంది. ఇక కమర్షియల్ సిలిండర్ విషయానికి వస్తే.. నిన్నటి వరకూ 19 కేజీలకు రూ.1769 ఉండగా.. నేటి నుంచి దీనిపై రూ.350.50 పెరిగింది. పెరిగిన ధరతో ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ రేటు రూ.2119.50కి చేరింది.