Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

కోవిడ్ తో పార్టీ ఫండింగ్ ఘోరంగా తగ్గిపోయింది.. ఆయా పార్టీలకు ఈ యేడాది ఫండింగ్ ఎంతో వచ్చిందో చూడండి..

కోవిడ్ వల్ల అన్ని రంగాలూ ఘోరంగా దెబ్బతిన్నాయి. ఆర్థికంగా, మానసికంగా కూడా కోవిడ్ అందర్నీ దెబ్బ తీసింది. ఆయా సంస్థలు, పరిశ్రమలు, చివరికి ప్రభుత్వాలు కూడా ఆర్థికంగా ఘోరంగా దెబ్బతిన్నాయి. ఈ దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే మెళ్లిగా కోలుకుంటున్నాయి. అయితే.. కోవిడ్ సమయంలో ఆయా రాజకీయ పార్టీల విరాళాల విషయంలో ఘోరంగా దెబ్బపడింది. దాదాపు విరాళాలు అన్ని రాజకీయ పార్టీలకు సగానికి సగం తగ్గిపోయాయట. 2020-21 ఆర్థిక సంవత్సంలో దేశంలోని గుర్తింపు పొందిన జాతీయ పార్టీల విరాళాలు 420 కోట్ల మేర తగ్గిపోయాయట. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రెటిక్ రిఫామ్స్ సంస్థ పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే 41.49 శాతం తక్కువ అని పేర్కొంది.

 

బీజేపీకి 2019-20 ఆర్థిక సంవత్సరంలో 785.77 కోట్ల విరాళాలు వచ్చాయి. అదే 2020-21 ఆర్థిక సంవత్సరంలో 477.54 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే గతంతో పోలిస్తే 39.23 శాతం మేర తగ్గింది. ఇక… సోనియా సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీకి 2019-20 లో 139 కోట్ల విరాళాలు వచ్చాయి. 2020-21 లో 74.52 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే.. 46.39 శాతం తగ్గిపోయాయి. జాతీయ పార్టీలకు అత్యధికంగా ఢిల్లీ నుంచే విరాళాలు వచ్చాయి. 246 కోట్లు ఒక్క ఢిల్లీ నుంచే వచ్చాయట. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి 71.68 కోట్లు, గుజరాత్ నుంచి 47 కోట్లు వచ్చాయి. అయితే.. దాదాపు పెద్ద జాతీయ పార్టీలకే 80 శాతం మేర విరాళాలు వచ్చాయి. మిగిలిన 20 శాతం చిన్న పార్టీలకు చేరాయి.

Related Posts

Latest News Updates