హ్యారీ పోర్టర్ నవలా రచయితి జేకే రౌలింగ్ను చంపుతామంటూ ట్విట్టర్ వేదికగా బెదిరింపులకు దిగడం కలకలం రేపింది. అమెరికాలో రష్దీపై జరిగిన హత్యాయత్నం ఘటనపై జేకే రౌలింగ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దాడిపై విచారం వ్యక్తం చేశారు. దాడి ఘటన తనను తీవ్రంగా బాధించిందని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు రౌలింగ్ ట్వీట్ చేశారు. దీనిపై కరాచీకి చెందిన మీర్ ఆసిఫ్ అజీజ్ అనే వ్యక్తి స్పందిస్తూ కంగారు పడొద్దు. తర్వాత నంబర్ మీదే అంటూ బెదిరింపులకు దిగాడు. సదరు వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన స్క్రీన్షాట్ను ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
