భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మూ ఈ నెల 25వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశ అత్యున్నత అధికార పీఠాన్ని అధిరోహించే తొలి గిరిజన మహిళ సంతాలీ తెగకు చెందిన ద్రౌపది ముర్మూనే. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమె 64 శాతం ఓట్లు పోందారు. ఈ నెల 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ముగుస్తుంది. ఆయన వీడ్కోలు సభ కూడా శనివారం పార్లమెంట్ హాలోలో సభ్యుల సమక్షంలో జరిగింది. ఇప్పుడు ఎంపీలు, ప్రముఖుల సమక్షంలో ముర్మూ ప్రమాణ స్వీకారానికి, ఆమె రాష్ట్రపతి పదవికి స్వాగత వేడుకకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేశ రాష్ట్రపతి సచివాలయ కార్యాలయంలో జరిగే రాష్ట్రపతి ప్రమాణస్వీకార ఘట్టానికి సంబంధించి సవివరణ్మాతక ప్రకటన వెలువరించింది.
