భారత 15 వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆమెతో పార్లమెంట్ సెంట్రల్ హాలులో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అయిపోగానే.. భారత్ మాతాకీ జై… వందే మాతరం… అంటూ ఎంపీలు నినాదాలు చేశారు. దాదాపు 2 నిమిషాల పాటు పార్లమెంట్ సెంట్రల్ హాలులో చప్పట్లు మోగుతూనే వున్నాయి.
అంతకు పూర్వం ద్రౌపది ముర్మును మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవిందఖ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు,సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, స్పీకర్ ఓం బిర్లా సాదర పూర్వకంగా పార్లమెంట్ సెంట్రల్ హాలులోకి తీసుకొని వచ్చారు. అంతకు ముందు ముర్ము రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. అక్కడ మాజీ రాష్ట్రపతి కోవింద్ దంపతులు పుష్పగుచ్ఛం ఇచ్చి, స్వాగతించారు. ఆ తర్వాత రాష్టపతి అంగరక్షక సేన ఆమెకు గౌరవ వందనం సమర్పించింది.