సీతా రామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ . త్వరలో మరో తెలుగు మూవీకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ స్టార్ డైరెక్టర్‌కు కథను ఒకే చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. మహానటి టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ . ఇటీవల సీతా రామం మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ తో కెమిస్ట్రీ ఆడియన్స్‌కు తెగనచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను మూవీ టీమ్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా మరో టాలీవుడ్ డైరెక్టర్‌కు దుల్కర్ సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్‌లో వార్తలు వస్తున్నాయి. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ఓ మూవీకి ఒకే చేశాడని టాక్ వస్తోంది. దుల్కర్ కోసం శేఖర్ కమ్ముల అదిరిపోయే కథ సిద్ధం చేశాడని.. ఈ స్టోరీకి దుల్కర్ పచ్చజెండా ఊపినట్లు టాలీవుడ్‌లో రూమర్లు స్ప్రెడ్ అవుతున్నాయి. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో ధనుష్‌తో శేఖర్ కమ్ముల ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ధనుష్ ‘సర్’ అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో యాక్ట్ చేయనున్నాడు. సో.. ఈ గ్యాప్‌లో దుల్కర్ సల్మాన్‌తో ఓ మూవీని శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నారట. ధనుష్ ‘సర్’ సినిమాను కంప్లీట్ చేసేలోపు.. ఆయన ఈ మూవీని పూర్తి చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.