వెన్నెల పాత్ర గుర్తిండిపోతుంది. దసరా మామూలుగా వుండదు.. కుమ్మేద్దాం: కీర్తి సురేష్
నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది. కీర్తి సురేష్ కథానాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోగ్రాండ్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది.
ప్రెస్ మీట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. దేశమంతా మా ‘దసరా’ విడుదల కోసం ఎదురు చూస్తోందని ప్రమోషన్ టూర్‌లో మాకు అర్థమయింది. దసరా థియేటర్స్ లో హిస్టీరియా క్రియేట్ చేస్తుంది. ఎస్ఎల్వి సినిమాస్ సుధాకర్‌గారు యూనిక్ ఐడియాలని సపోర్ట్ చేసే నిర్మాత. ఈ సినిమాకి ఆయన ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనిది. ఈ సినిమాతో రివార్డులు, అవార్డులు మొదలవుతాయి. ఇలాంటి మరెన్నో సినిమాలు చేయడానికి ఇది ఆరంభం అవుతుందని భావిస్తున్నాను. సతీష్ మాస్టర్ దసరాతో చాలా బిజీ అయిపోతారు. దసరా తో దీక్షిత్ అనే మంచి నటుడు దొరికాడు. ఇందులో సూరి అనే కీలక పాత్ర చేశాడు. ఈ సినిమాతో తను తెలుగు నటుడైపోతాడు. దర్శకుడు శ్రీకాంత్ గురించి 30 తర్వాత మీరంతా చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. కీర్తి సురేష్, నన్ను.. బాబు పొట్టి అనే పిలుస్తారు.