Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

భారత్ కి ధన్యవాదాలు ప్రకటించిన టర్కీ…. ఆపదలో ఆదుకున్నారంటూ ప్రకటన

ఆపద సమయంలో తమకు ఆపన్నహస్తం చాటినందుకు టర్కీ భారత్ కు ధన్యవాదాలు ప్రకటించింది. ఈ మేరకు భారత్ లో టర్కీ రాయబారి సునేల్ ఈ మేరకు ట్వీట్ చేశారు. దోస్త్ అని తాము కూడా సంబోధిస్తుంటామని.. టర్కీ, హిందీలో దోస్త్ అనే పిలుచుకుంటామన్నారు. కానీ… ఆపదలో వున్న సమయంలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడని, ఆపదలో వున్న సమయంలో భారత్ తమకు ఆపన్నహస్తం చాటిందన్నారు. అందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్ లో టర్కీ రాయబారి సునేల్ కార్యాలయానికి భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ వెళ్లి, భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ సందేశాన్ని వినిపించారు. భారత్ అండగా వుంటుందని హామీ ఇచ్చారు.

భారత దేశం మరోసారి మానవత్వాన్ని చాటుకుంది. ఆపదలో చిక్కుకునన్న టర్కీకి సాయం ప్రకటించి, మానత్వాన్ని చేతల్లో చూపించింది. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో సహాయాన్ని అందిస్తామని మోదీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే NDRF బృందాలు ప్రత్యేక వైమానిక దళ విమానంలో టర్కీ బయల్దేరాయి. జాగిలాల స్క్వాడ్, ఔషదాల పెట్టెలు, అడ్వాన్స్ డ్ డ్రిల్లింగ్ ఎక్విప్ మెంట్స్ తో పాటు సహాయక చర్యలకు అవసరమైన సామాగ్రి, పరికరాలతో బృందాలు బయల్దేరాయి. అయితే… ఈ బృందాల్లో మహిళలు కూడా వున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్వీట్ చేశారు. టర్కీ, సిరియాలను భూకంపం కుదిపేసింది. దాదాపు 4500మంది ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నంలోపు మూడుసార్లు భూకంపం రావడంతో భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. ఇప్పటికీ చాలా మంది భవనాల శిథిలాల కింద ఇరుక్కొని పోయారని పలువురు పేర్కొంటున్నారు.

టర్కీ, సిరియాలను భూకంపం కుదిపేసింది. దాదాపు 4500మంది ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నంలోపు మూడుసార్లు భూకంపం రావడంతో భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. ఇప్పటికీ చాలా మంది భవనాల శిథిలాల కింద ఇరుక్కొని పోయారని పలువురు పేర్కొంటున్నారు. దీంతో వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక్క సిరియాలోనే భూకంపంతో 2000 మంది చనిపోయినట్లు అక్కడి మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. సుమారు 20 వేల మంది తీవ్రంగా గాయపడి వుంటారని ఓ అంచనాకి వచ్చారు. టర్కీలోనే దాదాపు 15 వేలు, సిరియాలో దాదాపు 5 వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

 

Related Posts

Latest News Updates