క్యాసినో నిర్వహిస్తున్న హైదరాబాద్ కు చెందిన చికోటీ ప్రవీణ్, మాధవ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ లోని ప్రవీణ్, మాధవ రెడ్డితో పాటు ఏజెంట్ల ఇళ్లపై 8 చోట్ల ఏక కాలంలో దాడులు జరిగాయి. క్యాసినో ఆడే వారి కోసం స్పెషల్ విమానాలు, లోకల్ ఏజెంట్ల కోసం టిక్కెట్లు కూడా ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా బెంగాల్ లోని బాగ్ డోగ్ర ఎయిర్ పోర్టుకు కస్టమర్లను ఏజెంట్లను తరలించారు. అక్కడి నుంచి నేపాల్ లోని హోటల్ మెచి క్రౌన్ లో ఆల్ ఇన్ క్యాసినో పేరుతో ఈవెంట్ నిర్వహించారు.
జూన్ 10 నుంచి 13 వరకు ఇండో నేపాల్ బార్డర్ లో ఈవెంట ప్రైజ్ డబ్బును హవాలా రూపంలో చెల్లించారు. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు నుంచి ఆపరేషన్ సాగింది. ఇక… వీరు నేపాల్ తో పాటు ఆ దేశ సరిహద్దు ప్రాంతాలు, యూపీ సరిహద్దుల్లో క్యాసినో నిర్వహించారు. డబ్బంతా హవాలా మార్గంలో శ్రీలంకకు తరలించినట్లు ఈడీ అధికారులు తెలిపారు.