టీఆర్ ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుకు సంబంధించిన మధుకాన్ గ్రూప్ సంస్థల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే నిధుల మళ్లింపు వ్యవహారంలో మధుకాన్ సంస్థల 96.21 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. హైదరాబాద్, బెంగాల్, విశాఖ, ప్రకాశం జిల్లాల్లోని 88.85 కోట్ల విలువైన భూములను అటాచ్ చేసింది. అంతేకాకుండా మధుకాన్ కు సంబంధించిన షేర్లు అంటే 7.36 కోట్ల ఆస్తులను కూడా అటాచ్ చేసింది.
