దేశవ్యాప్తంగా చైనా మొబైల్ కంపెనీలపై ఈడీ దాడులు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో 40 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది. చైనాకు చెందిన షియోమి మొబైల్ కంపెనీల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఇప్పటికే షియోమి కంపెనీల సీబీఐ కేసు నమోదు చేసింది. హవాలా, మనీలాండరింగ్ కు పాల్పడినట్లు అభియోగాలున్నాయి. వేల కోట్లను అక్రమంగా విదేశాలకు తరలించారనే ఆరోపణలున్నాయి. ఫెమా నిబంధనల కింద స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియామి ఇండియాకు చెందిన 5521 కోట్లను ఈడీ సీజ్ చేసింది. షియామి ఇండియా చైనాకు చెందిన షియామి గ్రూపునకు చెందిన అనుబంధ కంపెనీ. గత కొద్ది కాలంగా చైనా మొబైల్ ఫోన్ కంపెనీల లావాదేవీలపై ఐటీ, ఈడీ కన్నేశాయి. మనీల్యాండరింగ్ ఆరోపణలపై చైనా మొబైల్ ఫోన్ కంపెనీలు లక్ష్యంగా ఈడీ దాడులు జరుగుతున్నాయి.
