ఢిల్లీ మద్యం కేసులో మరో కీలక వ్యక్తి అరెస్టయ్యాడు. చారియట్ మీడియాకు చెందిన రాజేష్ జోషిని ఈడీ అధికారులు నేడు అరెస్ట్ చేశారు. బుధవారమే ఎమ్మెల్సీ కవిత మాజీ సీఏ గోరంట్ల బుచ్చిబాబు అరెస్టయ్యారు. ఇది గడిచిన 24 గంటల్లోనే మరో కీలక వ్యక్తిని ఈడీ అరెస్ట్ చేసింది. రాజేష్ జోషి సౌత్ గ్రూపుకు 31 కోట్ల నగదును బదిలీ చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ విషయాన్ని ఈడీ తన విచారణలో గుర్తించింది.
ఈ డబ్బును ఆప్ గోవా ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు కూడా ఆరోపణలున్నాయి. రాజేష్ ని మరి కాసేపట్లో సీబీఐ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరపరచనున్నారు. ఢిల్లీకి చెందిన రాజేష్ జోషి నగదు బదిలీ చేయడంలో కీలకంగా వ్యవహరించారని ఈడీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి నగదును ఢిల్లీకి తరలించారని గుర్తించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటి వరకు సీబీఐ, ఈడీ అధికారులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత మాజీ సీఏ గోరంట్ల బుచ్చిబాబు సీబీఐ కస్టడీకి కోర్టు ఓకే చెప్పింది. సీబీఐ అధికారులు5 రోజుల కస్టడీ కోరగా.. రౌస్ ఎవెన్యూ కోర్టు 3 రోజులు మాత్రమే అనుమతించింది. లిక్కర్ స్కాంలో సీబీఐ బుచ్చిబాబును మంగళవారం అరెస్ట్ చేసింది. దీంతో ఆయన్ను సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. ఆయన తరపున న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే కస్టడీని వ్యతిరేకించారు. కేసు దర్యాప్తునకు సహకరిస్తున్నందున కస్టడీ అవసరంలేదని కోర్టుకు విన్నవించారు. త్తిపరంగా బుచ్చిబాబు క్లయింటుకు సేవలందించారని వివరణ ఇచ్చారు. మరోవైపు చట్టప్రకారమే బుచ్చిబాబును అరెస్ట్ చేశామన్న సీబీఐ తరఫు న్యాయవాది కేసు విచారణకు సహకరించనందునే ఆయన కస్టడీ కోరుతున్నట్లు చెప్పారు. చివరికి సీబీఐ మూడు రోజుల కస్టడీకి ఓకే చెప్పింది.