మనీలాండరింగ్ కేసులో భాగంగా కాంగ్రెస్ కు సంబంధించిన నేషనల్ హెరాల్డ్ దిన పత్రిక కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహించింది. కార్యాలయంతో పాటు మరో 12 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ 3 రోజుల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ విచారణ జరిగిన కొన్ని రోజులకే ఈడీ నేషనల్ హెరాల్డ్ దిన పత్రిక కార్యాయలంలో సోదాలు నిర్వహించడం సంచలనం రేపుతోంది.
కొన్ని రోజుల క్రితమే ఇదే విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. మరోవైపు నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఆస్తులను అటాచ్ చేయనుంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలపై కేంద్రం సమాధానం చెప్పలేకే… ఇలాంటి దాడులు చేస్తోందని కాంగ్రెస్ మండిపడుతోంది. ఈడీ వేధింపులకు తాము భయపడమని కాంగ్రెస్ స్పష్టం చేసింది.