మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో కొత్త ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే విజయం సాధించారు. సీఎం షిండేకి మద్దతుగా 164 ఎమ్మెల్యేలు ఓటు వేశారు. షిండే- బీజేపీకి వ్యతిరేకంగా 99 ఓట్లు పోలయ్యాయి. దీంతో షిండే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ రాహుల్ సర్వేకర్ ప్రకటించారు. దీంతో మరో రెండున్నరేళ్ల పాటు షిండే సీఎంగా మహారాష్ట్రను పరిపాలించనున్నారు. అయితే ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం విశ్వాస పరీక్షకు పూర్తి దూరంగా వున్నారు.
అంతేకాకుండా మాజీ సీఎం ఉద్ధవ్ శిబిరంలోని ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా షిండేకి సపోర్ట్ ఒచ్చారు. సంతోష్ బంగర్, శ్యాంసుందర్ షిండేలు కూడా షిండే వర్గంలోకి చేరిపోయారు. విశ్వాస పరీక్ష కోసం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. బీజేపీ ఎమ్మెల్యే సుధీర్ మునిగంటివార్, శివసేన ఎమ్మెల్యే భరత్ గోగావాలే విశ్వాస పరీక్షకు ప్రతిపాదించారు. దీంతో ప్రభుత్వానికి మద్దతిచ్చిన ఎమ్మెల్యేలను లెక్కపెట్టి, మెజారిటీ ప్రకటించారు.