ఇప్పటికే అస్తవ్యస్తంగా వున్న తెలంగాణ కాంగ్రెస్ కి మరో ఎదురు దెబ్బ తగిలింది. నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కి రాజీనామా చేసేశారు. కొన్ని రోజులుగా ఆయన పార్టీ వ్యవహార శైలిపై, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో వున్నారు. కాంగ్రెస్ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే తాను బీజేపీలో చేరుతున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చేశారు. తన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకి పంపినట్లు వెల్లడించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ ఛుగ్ ఆధ్వర్యంలో మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే పీసీసీ మహేశ్వర్ రెడ్డికి షోకాజ్ నోటీసులిచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని..గంటలోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
లంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి టీపీసీసీ షాక్ ఇచ్చింది. ఆయనకు బుధవారం మధ్యాహ్నం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గంటలోపు షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సమాధానం ఇవ్వకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ షోకాజ్ నోటీసుల్లో టీపీసీసీ పేర్కొంది.