ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలో గానీ, వేదికపై వుండే వారి జాబితాలో గానీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు పేరు లేదని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు ప్రకటించారు. అలాగే హెలిపాడ్ వద్ద ప్రధాని మోదీని ఆహ్వానించే వారి జాబితాలో కూడా ఆయన పేరు లేదన్నారు. ఎంపీ విషయంలో తాము చట్టం ప్రకారమే నడుచుకుంటున్నామని తెలిపారు.
అయితే.. ప్రధాని కార్యక్రమానికి ఆయన ఎలా వస్తున్నారో కూడా తమకు తెలియదని అన్నారు. ఎంపీ నెంబరును పోలీసు శాఖ బ్లాక్ లిస్టులో పెట్టిందంటున్న వార్తలో నిజం లేదని అన్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా బందోబస్తు విషయంలో కొన్ని ఆంక్షలు ఉంటాయని డీఐజీ పాలరాజు తెలిపారు.