ప్రముఖ నటి కంగనా రనౌత్ ఇందిరా గాంధీ లుక్ లో కనిపించనున్నారు. భారత దేశ రాజకీయాల్లో ఎమర్జెన్సీ ఘటన అత్యంత కీలకమైంది. దీని తర్వాతే దేశ రాజకీయాలు మార్పు చెందాయి. ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ఆధారంగా చేసుకొని, బాలీవుడ్ లో ఎమర్జెన్సీ అన్న చిత్రం రానుంది. ఇందులో కంగనా రనౌత్ ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఎమర్జెన్సీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే.. ఇందులో కంగనా అచ్చు ఇందిరా గాంధీ లాగే కనిపించడం విశేషం.
అయితే ఇది ఇందిరా గాంధీ బయోపిక్ మాత్రం కాదు. ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను మాత్రమే ఈ చిత్రంలో పొందుపరుస్తున్నారు. ఎమర్జెన్సీ అండ్ ఆపరేషన్ బ్లూస్టార్ అన్న పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. చిత్ర నిర్మాణంతో పాటు, దర్శకత్వం కూడా కంగనా రనౌత్ చేస్తోంది.
The epic story of Independent India’s darkest hour.
As we commence shoot, sharing a glimpse of #Emergency#EmergencyFirstLookhttps://t.co/t14SjqyDEb#KanganaRanaut @nishantpitti #AkshtRanaut @writish @gvprakash @manojmuntashir pic.twitter.com/FsD0Hk3ixZ— Manikarnika Films Production (@ManikarnikaFP) July 14, 2022