Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఈ దీపావళి కానుకగా నవంబర్ 9న అందరినీ భయపెట్టే సుమన్ బాబు ఎర్ర చీర సినిమా విడుదల

శ్రీ సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్ – పద్మాలయా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా బేబీ డమరి సమర్పణలో నిర్మించిన సౌత్ ఇండియా చిత్రం ఎర్ర చీర. ఇటీవల కాలంలో షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని నవంబర్ 9న విడుదల కానుంది. ఇందులో కళ్లు చెదిరేలా 36 నిమిషాల గ్రాఫిక్స్, లక్షలాది మంది అఘోరాలతో క్లైమాక్స్ తో కూడిన మదర్ సెంటిమెంట్, హర్రర్, యాక్షన్ ఎలిమెంట్స్ తో మంచి నిర్మాణ విలువలతో నిర్మించ్చబడినదని నిర్మాతల్లో ఒకరైన ఎన్వీవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ దీపావళి కానుకగా నవంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని దర్శకుడు మరియు నటుడు అయిన సుమన్ బాబు తెలిపారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో శ్రీరామ్, kgf ఫేమ్ అయ్యప్ప పీ శర్మ, సీనియర్ నటులు Dr. రాజేంద్ర ప్రసాద్ గారి ముద్దుల మనవరాలు అయిన మహానటి ఫేమ్ సాయి తేజస్విని, కారుణ్య చౌదరి, కమల్ కామరాజు, సుమన్ బాబు, అజయ్, అలీ, రఘుబాబు, గీతాసింగ్, జీవ, భద్రం, సురేష్ కొండేటి, అన్నపూర్ణమ్మ, సత్య కృష్ణ తదితరులు నటించారు.

మాటలు- గోపి విమల పుత్ర,
సంగీతం- ప్రమోద్ పులిగిల్ల
ఎడిటర్- వెంకట ప్రభు
రీ రికార్డింగ్- చిన్న
ఆర్ట్- సుభాష్, నాని
స్టంట్స్ – నందు
లైన్ ప్రొడ్యూసర్స్ – అబ్దుల్ రెహమాన్, కరణ్
చీఫ్ కో డైరెక్టర్స్- నవీన్, రాజమోహన్
నిర్మాతలు-సుమన్ బాబు, NVV. సుబ్బారెడ్డి
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం :- సుమన్ బాబు.

Related Posts

Latest News Updates