అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో పాల్గొనేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అమెరికా వెళ్లారు. అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో శుక్రవారం నుంచి ఈ నెల 3వ తేదీ వరకు ఆటా మహాసభలు జరుగుతున్నాయి. యూత్ కన్వెన్షన్ లో పాల్గొనాల్సిందింగా మంత్రి ఎర్రబెల్లిని ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. జూలై 2 న ఆటా మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మంత్రి ప్రసంగిస్తారు.