Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి…

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ తదితరుల సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కిరణ్ కుమార్ రెడ్డికి కండువా కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఎంపీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు.

 

ప్రహ్లాద్ జోషి కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ కండువా కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కిరణ్ కుమార్ రెడ్డి తన రాజకీయ జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారని, కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో పార్టీ బలోపేతం అవుతుందని తాము విశ్వసిస్తున్నామని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబం తరతరాలుగా కాంగ్రెస్ కి విధేయులుగా వున్నారని అన్నారు. అయితే… కొన్ని రోజుల క్రితం కిరణ్ కుమార్ ని తాను కలిసిన సమయంలో ప్రధాని మోదీ విధానాల పట్ల తాను ఆకర్షితుడనయ్యానని తెలిపారని పేర్కొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ జీవితం మచ్చలేని జీవితమన్నారు.

 

ఇక… మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తదితరుల పనితనం వల్లే బీజేపీ బలమైన శక్తిగా తయారైందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ లో మాత్రం అలాంటి పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ లో పార్టీ పటిష్టత, కార్యాచరణపై నాయకులతో చర్చించే అవకాశం కూడా వుండదని విమర్శించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చానని, కాంగ్రెస్ ను వీడుతానని కలలో కూడా అనుకోలేదని అన్నారు.

పార్టీ అధిష్ఠానం తప్పుడు నిర్ణయాలతోనే ఆ పార్టీ అధికారంలోకి కోల్పోయిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో నాయకత్వం చెల్లాచెదురుగా అయిపోయిందని, ఎవరి నాయకత్వంలో పనిచేయాలో కూడా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. తప్పుడు నిర్ణయాల వల్లే కాంగ్రెస్.. ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతోందన్నారు. విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ చెల్లాచెదురైందన్నారు. విభజనపై కాంగ్రెస్ ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకుందన్నారు. నాయకత్వ లేమితో కాంగ్రెస్ ఇబ్బందులు పడుతోందన్నారు. బీజేపీ ఎదుగుతున్నా కొద్దీ కాంగ్రెస్ దిగజారుకుంటూ వచ్చిందన్నారు.

1980లో 7.7శాతం ఉన్న బీజేపీ ఓటింగ్..2019లో 37 శాతానికి పైగా పెరిగిందని కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. తమది 1952 నుంచి కాంగ్రెస్ కుటుంబమన్నారు. అయితే ఓటమి నుంచి కాంగ్రెస్ గుణపాఠాలు నేర్చుకోలేదన్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు అధికారం మాత్రమే కావాలన్నారు. కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్స్ లేకుండా పోయారన్నారు. దేశాన్ని వృద్ధి చేయాలన్నది బీజేపీ లక్ష్యం బీజేపీయేనన్నారు.

Related Posts

Latest News Updates