జపాన్ మాజీ ప్రధాని షింబో అబేపై దుండగులు కాల్పులు జరిపారు. ఆయన వేదికపై ప్రసంగిస్తుండగా… ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారు. ఆయనపై కాల్పులు జరిపారని విలేకరులు పేర్కొంటున్నారు. నరా నగరంలో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
దుండగులు కాల్పులు జరపడంతో అబేకు తీవ్ర రక్త స్రావం అయ్యింది. వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరోవైపు కాల్పులు జరిపిన అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి మాజీ ప్రధాని షింజోలో ఎలాంటి కదలికలు లేవని తెలుస్తోంది.
WATCH: Bystanders rush to help former Japanese Prime Minister Shinzo Abe after he is shotpic.twitter.com/vgk7fn323p
— BNO News (@BNONews) July 8, 2022