యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి లక్ష్మి దేవమ్మ (85) కన్నుమూశారు. తల్లి మరణంతో హీరో అర్జున్ ఇంట ఒక్కసారిగా విషాద చాయలు నెలకొన్నాయి. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మైసూర్‌లో స్కూల్ టీచర్‌గా పనిచేసిన లక్ష్మీ దేవమ్మకు ఇద్దరు కుమారులు. వీరిలో ఒకరు యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా కాగా మరొకరు కన్నడ డైరెక్టర్ కిశోర్ సార్జా. ఇక లక్ష్మీ దేవమ్మకు ఒక కుమార్తె కూడా ఉంది. ఈమెకు ఇద్దరు కుమారులు, వారిలో ఒకరు రెండేండ్ల క్రితం మరణించిన కన్నడ నటుడు చిరంజీవి సార్జా కాగా, ధృవ సార్జా కన్నడ నాట స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఇక అర్జున్ కుమార్తె ఐశ్వర్యను టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ ఒక సినిమాను తీస్తున్నాడు. కాగా లక్ష్మీ దేవమ్మ మరణం పట్ల కన్నడ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం తెలిపారు.
