Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఏపీ ఆర్థిక మంత్రి… 2.79 లక్షల కోట్ల బడ్జెట్ సమర్పణ

2023- 24 వార్షిక బడ్జెట్‌ (Annual Budget 2023-24)ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి (AP Minister Buggan Rajendranath Reddy) గురువారం ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రెండు లక్షల 79 వేల 279.27 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను మంత్రి సభ ముందు ఉంచారు. ముందుగా పోతన పద్యంతో బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి మొదలుపెట్టారు. బడ్జెట్ రూపకల్పనలో భాగ్యస్వాములకు కృతజ్ఞతలు తెలియజేశారు. కరోనా సంక్షోభ సమయంలో అనేక ఇబ్బందులను తట్టుకొని నిలబడ్డామని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ సుస్థిర అభివృద్ధి, సుపరిపాలనైనే కేంద్రీకరించామన్నారు. ఇక… వార్షిక బడ్జెట్ 2 లక్షల 79 వేల 279 కోట్లు కాగా… రెవిన్యూ వ్యయం 2,28,540 కోట్లు. మూలధన వ్యయం 31,061 కోట్లు.

రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో ఏపీ బడ్జెట్

ఆర్థిక శాఖకు రూ.72,424 కోట్లు కేటాయింపు

వైద్య, ఆరోగ్య శాఖకు రూ.15,882 కోట్లు

వ్యవసాయ రంగానికి రూ.11,589 కోట్లు

పశుసంవర్ధక శాఖకు రూ.1787 కోట్లు

బీసీ సంక్షేమ శాఖకు రూ.23,509 కోట్లు

పర్యావరణానికి రూ.685 కోట్లు

జీఏడీకి రూ.1418 కోట్లు కేటాయింపు

హోంశాఖకు రూ.8206 కోట్లు కేటాయింపు

గృహనిర్మాణ శాఖకు రూ.6292 కోట్లు

గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3858 కోట్లు

నీటిపారుదల రంగానికి రూ.11,908 కోట్లు

పరిశ్రమలు, వాణిజ్యం రూ.2602 కోట్లు

మౌలిక వసతులు, పెట్టుబడులకు రూ.1295 కోట్లు

కార్మిక శాఖకు రూ.796 కోట్లు,

ఐటీ శాఖకు రూ.215 కోట్లు

న్యాయశాఖకు రూ.1058 కోట్లు కేటాయింపు

అసెంబ్లీ, సెక్రటేరియట్‌ రూ.111 కోట్లు

పట్టణాభివృద్ధికి రూ.9381 కోట్లు కేటాయింపు

మైనార్టీ సంక్షేమానికి రూ.2240 కోట్లు కేటాయింపు

నగదు బదిలీ పథకాలకు రూ.54 వేల కోట్లు

ఇంధన శాఖకు రూ. 6546 కోట్లు కేటాయింపు

అగ్రవర్ణ పేదల సంక్షేమానికి రూ. 11,085 కోట్లు

సివిల్ సప్లై – రూ. 3725 కోట్లు, జీఏడీకి రూ.1,148 కోట్లు

పబ్లిక్ ఎంటర్‌ ప్రైజెస్ రూ.1.67 కోట్లు, ప్రణాళిక 809 కోట్లు

రెవెన్యూ రూ.5380 కోట్లు, రియల్ టైం గవర్నెస్ రూ.73 కోట్లు

స్కిల్‌డెవలప్‌మెంట్‌కు రూ. 1167 కోట్లు

సాంఘిక సంక్షేమం రూ.14511 కోట్లు, R&Bకి రూ.9119 కోట్లు

స్త్రీ, శిశు సంక్షేమం రూ.3951 కోట్లు

యూత్, టూరిజం రూ.291 కోట్లు

డీబీటీ స్కీమ్‌లకు రూ.54,228.36 కోట్లు కేటాయింపు

పెన్షన్లు రూ.21,434 కోట్లు

రైతు భరోసాకు రూ.4020 కోట్లు

జగనన్న విద్యా దీవెనకు రూ.2842 కోట్లు

వసతి దీవెనకు రూ.2200 కోట్లు

వైఎస్సార్ పీఎమ్ బీమా యోజనకు రూ. 700 కోట్లు

డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు రూ.300 కోట్లు

రైతులకు వడ్డీ లేని రుణాలకు రూ.500 కోట్లు

కాపు నేస్తం రూ.550 కోట్లు

జగనన్న చేదోడుకు రూ.350 కోట్లు

వాహనమిత్ర రూ.275 కోట్లు

నేతన్న నేస్తం రూ.200 కోట్లు

మత్స్యకార భరోసా రూ.125 కోట్లు

మత్స్యకారులకు డీజిల్ సబ్సిడి రూ.50 కోట్లు

ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు

వైఎస్సార్ కళ్యాణమస్తు రూ.200 కోట్లు

వైఎస్సార్ ఆసరా రూ.6700కోట్లు

వైఎస్సార్ చేయూత రూ.5000 కోట్లు

అమ్మఒడి రూ.6500 కోట్లు

బీసీ కార్పొరేషన్‌కు రూ.22,715 కోట్లు

ఎస్పీ కార్పొరేషన్‌కు రూ.8384.93 కోట్లు

ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.2428 కోట్లు

ఈబీసీ కార్పొరేషన్‌కు రూ.6165 కోట్లు

కాపు కార్పొరేషన్‌కు రూ.4887 కోట్లు

క్రిస్టియన్ కార్పొరేషన్‌కు రూ.115.03 కోట్లు

బ్రాహ్మణ కార్పొరేషన్ రూ.346.78 కోట్లు

మైనారిటీ కార్పొరేషన్‌కు రూ.1868.25 కోట్లు కేటాయింపు

 

Related Posts

Latest News Updates