పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలో శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. జిల్లాలోని దువ్వ వేణుగోపాల స్వామి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో పందిళ్లు మంటకు ఆహుతయ్యాయి. అయితే.. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆలయంలోని భక్తులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్రభయాందోళనకు గురయ్యారు.అయితే.. సీతారాముల కల్యాణం సమయంలో యువకులు గుడి బయట బాణాసంచా కాల్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తారా జువ్వ కరెంట్ వైర్లపై పడటం, వెంటనే షాట్ సర్క్యూట్ జరగడం సంభవించింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
