Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఫ్లోరైడ్ పోరుబిడ్డ అంశాల స్వామి ఇకలేరు

ఫ్లోరోసిస్ పోరాట యోధుడు అంశాల స్వామి (37) అకాల మరణం చెందారు. ఇటీవల తనకు ఓ వ్యక్తి బహూకరించిన ఎలక్ట్రిక్ బైక్పై బయటకు వెళ్లి వచ్చిన స్వామి,  ఇంట్లోకి వెళ్తున్న క్రమంలో అదుపు తప్పి కింద పడిపోయారు. తలకు బలమైన గాయం కావడంతో అంతర్గతంగా రక్తస్రావమై శనివారం ఉదయం 6:30 గంటలకు మృతి చెందారు. ఆయన మృతిపట్ల సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. స్వామి అకస్మాత్తుగా మృతి చెందడంతో కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి శివన్నగూడెంలో స్వామి మృతదేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదారుస్తూ అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంత్యక్రియలకు గ్రామస్థులతో పాటు పలువురు ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాల నేతలు భారీగా హాజరయ్యారు.

Related Posts

Latest News Updates