నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో మధ్యాహ్న భోజనం వికటించి 60 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎగ్ ఫ్రైడ్ రైస్ కలుషితం కావడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పీయూసీ1, పీయూసీ2 మెస్ లలో ఈ ఘటన జరిగింది. ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్న విద్యార్థులకు మెళ్లి మెళ్లిగా వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. క్రమ క్రమంగా కళ్లు తిరిగి పడిపోయారు. అధికారులు వారిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఎగ్ ఫ్రైడ్ రైస్ తినడం వల్లే జరిగిందా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అని అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు విద్యార్థులందరికీ మెరుగైన వైద్యం అందించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.
