తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే వుంది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్ తో ఇవాళ ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఫాక్స్ కాన్ ఒప్పందం చేసుకుంది.
https://twitter.com/KTRBRS/status/1631231837707325441?s=20
ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో లక్ష మందికి ఉపాధి కల్పిస్తామని ఫాక్స్ కాన్ ప్రకటించింది. తెలంగాణలో ఫాక్స్ కాన్ పెట్టుబడులపై హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. లక్ష మందికి ఉపాధి కల్పించడం గొప్ప విషయమన్నారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన అనంతరం ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియూ ప్రకటించారని కేటీఆర్ పేర్కొన్నారు.