Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

సినీ నటి దెబ్లీనా దత్ చేతుల మీదుగా డాక్టర్ గణేష్ గొర్తి కి ఎఫ్ టి పి సి ఇండియా పురస్కారం

సినీ పరిశ్రమకు తమ ఆరోగ్య సేవలు.. డాక్టర్ గణేష్ గొర్తి

తెలుగు సినిమా లో రాణించడం తన డ్రీం..సినీ నటి దెబ్లీనా దత్తా

రొబోటిక్ గాస్ట్రోఇంటస్టినల్ మరియు బారియాట్రిక్ సర్జన్ గా చిత్ర పరిశ్రమతో పాటు ఎందరికో సుపరిచితులైన గణేష్ గొర్తి కి ఎఫ్ టి పి సి ఇండియా పురస్కారం లభించింది. భారతదేశంలోనే మొదటిసారిగా 39 సంవత్సరాల మహిళకు ఎస్ ఎస్ ఐ మంత్ర రోబో సర్జరీ ని గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్ లో నిర్వహించి విజయవంతమైన డాక్టర్ గణేష్ ని హెల్త్ అండ్ మెడికల్ అచీవ్ మెంట్ అవార్డు పేరుతొ ఘనంగా సత్కరించింది. పాన్ ఇండియా సినీ నటి దెబ్లీనా దత్తా చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ గణేష్ మాట్లాడుతూ కాంటినెంటల్ హాస్పిటల్ లో వున్న అత్యాధునిక వ్యవస్థ మా టీం డెడికేషన్ తో ఈ ఘనతని సాధించామని , ఉభయ తెలుగు రాష్ట్రాలకి ఇది ఏంటో గర్వకారణమని, ఆరోగ్య రంగాన్ని కూడా గుర్తించి సినీ సంస్థ నన్ను సత్కరించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని సినీ పరిశ్రమకు తమ ఆరోగ్య సేవలు ఎప్పుడు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఎఫ్ టీ పి సి ఇండియా అధ్యక్షులు చైతన్య జంగా మాట్లాడుతూ మన దేశ వైద్యరంగానికే గర్వకారణమైన డాక్టర్ గణేష్ గారి సేవలను చలన చిత్ర పరిశ్రమ వినియోగించుకోవాలని అన్నారు. కాంటినెంటల్ హాస్పిటల్ ప్రతినెలా ఉచిత మెడికల్ క్యాంపు లు నిర్వహించేలా ఒప్పించాలని సంస్థ ప్రధాన కార్యదర్శి వీస్ వర్మ పాకలపాటి అభ్యర్ధించారు. పదికి పైగా బాషలలో నటించిన తాను ఓ సారి పెద్ద చిత్రంలో తెలుగు సినిమా అవకాశం వస్తే అప్పటికే ఆ డేట్స్ ఒక హిందీ చిత్రానికి కేటాయించిన కారణంగా నటించలేకపోయానని , తెలుగు సినిమా లో రాణించడం తన డ్రీం అని సినీ నటి దెబ్లీనా దత్తా అన్నారు.

Related Posts

Latest News Updates