ప్రముఖ గజల్ గాయకుడు భూపిందర్ సింగ్ (82) కన్ను మూశారు. కొంత కాలంగా ఆయన కొలన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అంతేకాకుండా కోవిడ్ రుగ్మలతో బాధపడుతూ ఆయన తుది శ్వాస విడిచారు. కొన్ని రోజుల కింద ఆయన మూత్రం ఇన్ ఫెక్షన్ తో తీవ్ర అస్వస్థతకు గురై, ఆస్పత్రిలో చేరారు. నిన్న సాయంత్రం తుది శ్వాస విడిచారని ఆయన భార్య ప్రకటించారు. ఈయన గజల్ గాయకుడే కాకుండా… బాలీవుడ్ లో అనేక హిట్ పాటలను కూడా పాడి, ప్రేక్షకులను అలరించారు.1982 లో ధర్మకాంటా మూవీలో దునియా చుట్టే యార్ న చుట్టే తో పాటు మాసూమ్ మూవీలో హుజూర్ ఇస్ కదర్ కా లాంటి పాటలు పాడారు. మహ్మద్ రఫి, లతా మంగేష్కర్, ఆశాభొంస్లే, బప్పీలహరితో కలిసి పనిచేశారు.
