అధికార టీఆర్ ఎస్, బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. ఇరు పార్టీల నేతలు పోటా పోటీగా ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేసుకుంటున్నారు. తాజాగా.. బీజేపీ తన రాష్ట్ర ప్రధాన కార్యాలయం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ భవన్ ఎదురుగా ఓ డిజిటల్ అడ్వర్టైజ్ మెంట్ ఏర్పాటు చేసింది. సాలు దొర.. సెలవు దొర అంటూ దీని థీమ్. అయితే.. ఇది నిబంధనలకు విరుద్ధంగా వుందంటూ బీజేపీకి జీహెచ్ఎంసీ 50 వేల జరిమానా విధించింది. అక్కడే ప్రధాని మోదీ, జేపీ నడ్డాతో వున్న బ్యానర్ కూడా వుంది. దీనికి 5 వేల జరిమానా విధించారు.
ఇక.. బీజేపీ ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో టీఆర్ ఎస్ కూడా కౌంటర్ గా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే మెట్రో పిల్లర్లతో పాటు.. ప్రధాన స్థలాల్లో మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. సాలు మోదీ.. సంపకు మోదీ.. అంటూ ఫ్లెక్సీ పెట్టారు. అందులో నల్లధనం, నోట్లరద్దు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు, రైతు చట్టాలు, అగ్నిపథ్ వంటి అంశాలను ముద్రించారు.