కాంగ్రెస్ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ రాజీనామ చేశారు. రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆజాద్ 14 రోజుల్లోనే కొత్త పార్టీ తొలి యునిట్‌ను జమ్ము కశ్మీర్ ఏర్పాటు చేయబోతున్నారని ఆయన సన్నిహితుడు ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి జీఎం సరూరి తెలిపారు. సైద్ధాంతికంగా లౌకికవాది అయిన ఆజాద్ ఆదేశానుసారం పనిచేసే ప్రశ్నే లేదని నొక్కి చెప్పారు. అజాద్ కాంగ్రెస్ పార్టీని వీడటంతో వందలాది మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పంచాయతీ రాజ్ సంస్థల సభ్యులు, ప్రముఖులు కూడా తమ రాజీనామా సమర్పించినట్లు పేర్కొన్నారు. అంతేకాదు మా కొత్త పార్టీని ప్రారంభించేందుకు సెప్టెంబర్ 4న ఆజాద్ జమ్ము కశ్మీర్‌కి వస్తున్నారని అన్నారు. ఆజాద్ కూడా తాను కొత్త జాతీయ పార్టీని ప్రారంభించే తొందరలో లేనని జమ్ము కశ్మీర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.