స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల కాలంలో భారత్ సాధించిన విజయాలన్నిటినీ గూగుల్ వీడియో రూపంలోకి తీసుకొచ్చింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా ఇండియా కా ఉడాన్ అనే పేరుతో వీడియో రిలీజ్ చేసింది. రాజ్యాంగ రూపకల్పన, ఎన్నికల నిర్వహణ నుంచి స్పేస్ లోకి శాటిలైట్లు పంపడం, క్రికెట్ లో ప్రపంచ కప్ గెలవడం వరకు అనేక అచీవ్ మెంట్స్ ను వీడియోలో పొందుపరిచింది. వీడియోలు, ఫొటోలు, డ్రాయింగ్స్, కథనాలతో స్వతంత్ర భారత విశేషాలను పొందుపరిచింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.