గోపీచంద్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో శుక్రవారం ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. గోపీచంద్ నటిస్తున్న 31వ చిత్రమిది. కన్నడ దర్శకుడు ఏ.హర్ష రూపొందిస్తున్నారు.
సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా నిర్మాత కెకె రాధామోహన్ మాట్లాడుతూ…‘మా సంస్థలో నిర్మిస్తున్న 14వ చిత్రమిది. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను నిర్మిస్తున్నాం. ఇప్పటి వరకూ గోపీచంద్ పలు భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లు చేశారు. ఈ చిత్రం మాటికి దానికి భిన్నంగా వుంటుంది. ఈ నెలలోనే సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు.
తారాగణం: గోపీచంద్
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: ఎ హర్ష
నిర్మాత: కెకె రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
డీవోపీ: స్వామి జె
సంగీతం: రవి బస్రూర్
ప్రొడక్షన్ డిజైనర్: రమణ వంక
పీఆర్వో: వంశీ-శేఖర్