వైసీపీ ఎంపీ గోరంట మాధవ్ న్యూడ్ కాల్ పై టీడీపీ, వైసీపీ మధ్య మళ్లీ మాటల యుద్ధం ప్రారంభమైంది. అదో ఫేక్ కాల్ అని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తాజాగా వ్యాఖ్యానించారు. అలాంటి ఫేక్ వీడియోను పట్టుకొని, టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. అమెరికా నుంచి చంద్రబాబు దొంగ సర్టిఫికేట్ తెప్పించుకున్నారని, టీడీపీ పంపిణీ చేస్తున్న సర్టిఫికేట్ తాము ఇచ్చింది కాదని ఎక్లిప్స్ సంస్థే స్వయంగా ప్రకటించిందని అన్నారు. ఓటుకు నోటు కేసులో ఆ వాయిస్ తనది కాదని చంద్రబాబు ప్రమాణం చేయగలరా? అని ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రశ్నించారు.
పట్టుబడిన రూ.50 లక్షల లంచం తనది కాదని చెప్పగలరా అని నిలదీశారు.చంద్రబాబు మనసూస్పర్తిగా కాణిపాకం వినాయకుడి వద్ద ప్రమాణం చేస్తే.. తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. చంద్రబాబుకు దమ్ముంటే సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఆడపిల్ల కనిపిస్తే ముద్దాయినా పెట్టాలి.. లేదంటే కడుపైనా చేయాలి అన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై ఎల్లో మీడియా ఎందుకు చర్చకు పెట్టలేదు?. లోకేష్ అశ్లీల చిత్రాలపై చర్చ ఎందుకు పెట్టరు?. ఫేక్ వీడియో తీసుకొచ్చి బీసీ ఎంపీపై కక్ష సాధిస్తారా?. చంద్రబాబు, ఎల్లో మీడియాది కుల దురహంకారం కాదా?’అంటూ ఎంపీ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.