Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

జీవితాంతం ఏపీ ప్రజలను గుర్తుంచుకుంటా… జగన్ నా కుటుంబ సభ్యుడు : గవర్నర్

ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడ్కోలు సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ మాట్లాడుతూ… సీఎం జగన్ చూపిన గౌరవం, ఆప్యాయత ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. కంఠంలో ప్రాణం వున్నంత వరకూ ఏపీ ప్రజలను గుర్తుంచుకుంటానని తెలిపారు.

ఏపీ ప్రజల కోసం సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, వ్యవసాయ రంగంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ముందంజలో వుందన్నారు. సీఎం జగన్ తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలు ఆదర్శంగా వున్నాయని కితాబునిచ్చారు. ఏపీ ప్రజలు అందించిన ప్రేమ, అభిమానం ఎంతో అద్భుతమైందన్నారు. సీఎం జగన్ ను తాను కుటుంబీకుడిగానే భావిస్తున్నానని, ఏపీ తన రెండో ఇల్లు అని ప్రకటించారు.

 

ఈ ఆత్మీయ సమ్మేళనానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఓ తండ్రిలా, పెద్దలా రాష్ట్ర ప్రజల అభివ్రుద్ధికి అండగా నిలిచారన్నారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ఏపీ ప్రజల తరపున ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. గవర్నర్ వ్యవస్థకు నిండుతనం తీసుకువచ్చారంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. రాజ్యాంగ వ్యవస్థ ఎలా ఉండాలో ఆచరణలో చూపించారన్నారు. గవర్నర్ వ్యవస్థకు ప్రభుత్వానికి, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య ఇబ్బందులు చూస్తున్నామని, కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదన్నారు. గవర్నర్ స్వాతంత్ర సమరయోధులని, ఒరిస్సా ప్రభుత్వం లో మంత్రి గా బాధ్యతలు నిర్వర్తించి తనదైన ముద్ర వేశారని జగన్ కొనియాడారు.

Related Posts

Latest News Updates