ముంబై ఆర్థిక పరిస్థితిని ఉద్దేశించి ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాతీలు, రాజస్థానీలు మహారాష్ట్రను విడిచి వెళితే…. మహారాష్ట్రలో డబ్బే మిగలదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై దేశ వాణిజ్య రాజధానిగా ప్రస్తుతం పిలవబడుతోందని, మెళ్లిగా ఆ అర్హతను కోల్పోయే ప్రమాదం వుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను శివసేన తీవ్రంగా తప్పుబట్టింది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ.. కష్టపడి పనిచేసే మహారాష్ట్ర ప్రజలను గవర్నర్ అవమానించారని మండిపడ్డారు. బీజేపీ మద్దతుతో షిండే అధికారంలోకి రాగానే.. మరాఠీ వ్యక్తి అవమానానికి గురవుతున్నారనని, ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలను ఖండించాలని రౌత్ డిమాండ్ చేశారు.
