మహారాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా మలుపు తిరిగింది. పోలీస్ శాఖతో గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారన్న ఊహాగానాలు బలంగానే వినిపిస్తున్నాయి. మరోవైపు ఎప్పటికప్పుడు గవర్నర్ జరుగుతున్న పరిణామాలను కేంద్రానికి రిపోర్ట్ చేస్తూనే వున్నారు. అయితే.. పూర్తి స్థాయిలో కేంద్రంతో చర్చించిన తర్వాత గవర్నర్ కీలక అడుగులు వేసే ఛాన్స్ వున్నట్లు రాజ్ భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి.
రెబెల్స్ ముంబైలో అడుగుపెడితే.. వారిపై శివసేన నేతలు దాడిచేసే ఛాన్స్ వున్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక.. ఎంపీ నవనీత్ కౌర్ రానా రాష్ట్రంలో రాష్ట్రపతి పానల విధించాలని కేంద్ర హోంశాఖను కోరడం సంచలనం రేపుతోంది. శివ సైనికుల గుండాయిజంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పేలా వున్నాయని ఆమె వ్యాఖ్యానించింది.